అక్కడ కొబ్బరికాయలతో హోలీ ఆడితే... కష్టాలు.. బాధలు తొలగిపోతాయి..

రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో జరిగే హోలి వేడుకల్లో విభిన్న మైన ఆచారం ఉంది.  హోలికాదహన్​కార్యక్రమంలో కట్టెలకు బదులు కొబ్బరికాయలు ఉపయోగిస్తారు.  ఈ సంప్రదాయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.రాజస్థాన్ లోని ఉదయపూర్ ( Udaipur )లో ఇలాంటి విభిన్నమైన శైలి ఉంటుంది.దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​ సమీపంలో కర్కెలా ధామ్ గిరిజనులు  కొబ్బరికాయలతో హోలీ ఆడే సంప్రదాయం ఉంది.బాబోయ్ కొబ్బరికాయలతో హోలీ ఏంటి అని భయపడకండి.కొబ్బరికాయలతో హోలీ అంటే ఒకరిపై ఒకరు కొబ్బరికాయలు కొట్టుకుని హోలీ ఆడరు.ఇక్కడి ప్రజలు హోలీకాకు కొబ్బరికాలను సమర్పించి హోలీ నీ జరుపుకుంటారు. తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడి అగ్నిలో వేస్తే వారి జీవితంలో అన్నీ కష్టాలు బాధలు తొలగిపోతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఉదయపూర్ లోని సెమ్రీ పట్టణంలోని ధంకవాడ గ్రామపంచాయతీ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కెలా ధామ్ గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు.ఇక్కడి గిరిజనులు హోలీ కను తమ కూతురు అని నమ్ముతారు.

హోలీ వేడుకలు వివిధ రూపాలలో, వివిధ ప్రదేశాలలో జరుపుతారు.ఉదయపూర్ లోని సెమరీలోని కర్కెలా ధామ్‌లో కొబ్బరి హోలీ చాలా కాలంగా ప్రజలను ఆకర్షిస్తూ ఉంది. అందుకే హోలీ నీ ముందుగా కర్కెలా ధామ్‌లో మాత్రమే జరుపుకోవాలని ఒక నమ్మకం కూడా ఉంది.ఆదివాసీల పవిత్ర ప్రదేశం కర్కెలా ధామ్‌లో హోలీకాను మొదట వెలిగిస్తారు. .
ఇక్కడ ప్రజలు హోలీ దహన్ తర్వాత ఎగిసిపడుతున్న మంటలను చూసిన తర్వాతే చుట్టుపక్కల హోలీ కాను కాలుస్తారు.కర్కెలా ధామ్ ఎత్తైన కొండపై ఉన్నందున హోలికా దహన్ దూరం నుంచి కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రమే పరిసర ప్రాంతాలలో హోలీని జరుపుకుంటారు.తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడి అగ్నిలో వేస్తే వారి జీవితంలో అన్నీ కష్టాలు బాధలు తొలగిపోతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

పర్వతం మీద ఉన్న కర్కేలా ధామ్ దగ్గర హోలిక ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చున్నదని గిరిజనులు నమ్ముతారని ఇక్కడి స్థానికులు చెబుతారు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఒక అద్భుతం చేశాడని, దాంతో హోలిక మంటల్లో కాలిపోయి ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు ఇక్కడి గిరిజనులు నమ్ముతారు. ఈ కారణంగానే హోలికాకు వీడ్కోలు చెప్పడానికి కొబ్బరికాయను అగ్నికి సమర్పించుకుంటారు. హోళికకు కొబ్బరికాయను కానుకగా ఇస్తే తమ కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. దీనికోసం ప్రతీ యేటా ఇక్కడ లక్షలకొద్దీ కొబ్బరికాయలతో హోళిక తయారు చేస్తారు. 

హోలికా దహనం సందర్భంగా కాన్పూర్‌తో పాటు, సమీప నగరాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. కొబ్బరికాయను తలపై పెట్టుకుని హోలీలో వేస్తారు. తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడి అగ్నిలో వేస్తారో వారికి జీవితంలో అన్ని కష్టాలు, బాధలు హోలిక అగ్నిలో కొబ్బరికాయతో పాటు కాలిపోతాయని, వారి జీవితం ఆనందంగా మారుతుందని నమ్ముతారు. అంతేకాదు. హోలీ రోజు కొబ్బరికాయను కాల్చడం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉందని చెబుతారు. అది పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఎందుకంటే కొబ్బరి పొగ ఎంత వరకు చేరుతుందో ఆ ప్రాంతంలోని వ్యాధులు నయమై పర్యావరణం శుద్ధి అవుతుంది. దీని వల్ల మనుషులతో పాటు జంతువులు, పక్షులు ఆరోగ్యంగా ఉంటాయి.